
నకిలీ ఎస్టీ ధ్రువపత్రాల జారీపై విచారణకు డిమాండ్
చింతపల్లి: మండలంలో నకిలీ ఎస్టీ ధ్రువపత్రాలను పొందిన గిరిజనేతరులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గిరిజన ఉద్యోగులు సంఘం మండల అధ్యక్షుడు బౌడు గంగరాజు అన్నా రు. మంగళవారం అక్రమంగా ఆదివాసీలు పేరిట నకిలీ ధ్రువపత్రాలను పొందిన గొందిపాకలు గ్రామానికి చెందిన వారిపై చర్యలు చేపట్టాలని తహసీల్దారు ఆనంద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ వాల్మీకి తెగలో చింతపల్లి, దుమ్మలు ఇంటిపేర్లు లేవని, అయినా కొంతమంది అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా ఈ నకిలీ కుల ధ్రువపత్రాలను పొంది, రాయితీలు పొందుతున్నారని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ఉద్యోగులు సంఘం నాయకులు శశికుమార్, గిరి, రామకృష్ణ, మోహన్, కంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు.