
రోగి మృతిపై విచారణ
రంపచోడవరం: రంపచోడవరం మండలం ఐ.పోలవరం గ్రామానికి చెందిన కంగల చెల్లాయమ్మ మృతిపై మంగళవారం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నీలవేణి పునర్విచారణ జరిపారు. ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్ నిర్వహించిన విచారణలో రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని, ఆసుపత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని, మెరుగైన వైద్యం అందించాలని, రిఫరల్ కేసులను త్వరితగతిన చేపట్టాలన్నారు. రోగుల ప్రాణాల మీదకు వచ్చే వరకు ఉంచవద్దన్నారు. మాతాశిశు మరణాలు లేకుండా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేస్తే అండగా ఉంటామని విచారణ కమిటీతో తెలిపారు. ఎంపీటీసీ కుంజం వంశీ పాల్గొన్నారు.