
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
పాడేరు : శానిటేషన్ కార్మి కులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు హెచ్చరించారు. మంగళవారం పాడేరులో శానిటేషన్ కార్మికుల జిల్లా విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు గతేడాది నవంబర్ నుంచి పెంచిన వేతనాలు రూ.18,600 చెల్లించాలని, కార్మికులకు డ్యూటీ చార్ట్ ఇవ్వాలన్నారు. ప్రధానంగా ఈపీఎఫ్, పీఎఫ్ తప్పిదాలను సరి చేయాలన్నారు. కార్మికులందరికి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలతో పాటు బకాయి పడ్డా వేతనాలను తక్షక్షణమే చెల్లించాలన్నారు. వేతనాలతో కూడిన తొమ్మిది జాతీయ సెలవులు వర్తింపజేయాలన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికుల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షురాలిగా ముత్యాలమ్మ(పాడేరు), ప్రధాన కార్యదర్శిగా రఘు(అరకు)తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.