
ఆదికర్మయోగి అభియాన్‌తో గ్రామాల అభివృద్ధి
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల అభివృద్ధికై విజన్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి తెలిపారు. మండల కేంద్రంలో స్థానిక మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మంగళవారం ఆదికర్మయోగి అభియాన్‌లో ఎంపికై న 9 గ్రామాల అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు మంగళవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికై విజన్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. మండలంలోని ఎంపికై న 9 గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, వైద్యం, పారిశుధ్య పరిస్థితులను పూర్తిగా పరిశీలించి, గ్రామాల్లో మౌలిక వసతులుపై నివేదిక తయారు చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
అనంతరం శిక్షణ పూర్తి చేసిన అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా శిక్షణ అధికారిణి నాగశిరీష, ఎంఈవో కృష్ణమూర్తి, ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.