
సబ్ కలెక్టర్ దృష్టికి గ్రామ సమస్యలు
సీలేరు : గత ఏడాది సెప్టెంబర్‌లో భారీ విపత్తు వచ్చి పూర్తిగా ధ్వంసం అయిన జీకే విధి మండలం దారకొండ పంచాయతీ తోక రాయి, కమ్మరి తోట గ్రామాలను సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ గురువారం పర్యటించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా దారకొండ సర్పంచ్ రాజు తదితరులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సబ్ కలెక్టర్‌కు తెలియజేశారు. ఇందులో భాగంగా కమ్మరితోట, కొంగపాకలు, డి.కొత్తూరు, పెట్టిరాయి గ్రామాల్లో ఉపాధ్యాయులను నియమించాలని, తుపాను కారణంగా చిన్నగంగవరం ,నిమ్మచెట్టు బ్రిడ్జిలు కొట్టుకుపోవడం వలన స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాల్లో రహదారులు బాగు చేయించాలని తెలిపారు. దారకొండను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. తహసీల్దార్ అన్నాజీరావు, తదితరులున్నారు.