
దివ్యాంగులపై కూటమి కక్ష సాధింపు
7వ పేజీ తరువాయి
నిధులు మంజూరు చేస్తుందని, వాటితోనే ప్రస్తుతం ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సీఎం, మంత్రులు మాత్రం నిధులు ఇవ్వకపోయినా ఏజెన్సీకి తరచూ వస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. రూ.వందల కోట్లు, వేల కోట్లు అంటూ ప్రచారం తప్ప అభివృద్ధి లేదన్నారు. గిరిజన ప్రాంతాల సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం చేస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు వైస్ ఎంపీపీ కుంతూరు కనకలమ్మ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, కుజ్జెలి, లగిశపల్లి ఎంపీటీసీలు కుంతూరు నరసింహమూర్తి, లకే రామకృష్ణపాత్రుడు, మహిళా విభాగం నేత లకే రామసత్యవతి పాల్గొన్నారు.
వెల్లువెత్తిన వినతులు
ముంచంగిపుట్టు: మండలంలో 23 పంచాయతీల పరిధిలో 41 మంది పింఛన్లు తొలగింపులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పునరుద్ధరించాలంటూ అర్హుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలను తమ బాధను విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం స్తానిక మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రను బంగారుమెట్ట పంచాయతీ పింఛన్‌దారులు కలిశారు. తొలగించిన పింఛన్ల పునరుద్ధరకు చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పింఛన్ల తొలగింపు సరికాదని, నెలవారీ పింఛన్‌పై ఆధారపడి బతికే వారిని అవస్థలకు గురిచేయడం దారుణమన్నారు. తక్షణమే అర్హులందరికీ పునరుద్ధరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.