
దివ్యాంగులపై కూటమి కక్ష సాధింపు
మిగతా 8వ పేజీలో
సాక్షి,పాడేరు: దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడి పింఛన్లు రద్దు చేయడం అన్యాయమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ధ్వజమెత్తారు. బుధవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన దివ్యాంగులకు సామాజిక పింఛన్లు మంజూరు చేసిందన్నారు. అంగవైకల్యం,ఇతర రుగ్మతలు కళ్లకు కనబడుతున్నా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మాత్రం కనిపించకపోవడం అన్యాయమన్నారు. ప్రతి నెలా సామాజిక పింఛన్ ఆధారంగా జీవిస్తున్న దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం నోటీసులిచ్చి వచ్చే నెల నుంచి పింఛన్ల సొమ్ము పంపిణీని నిలిపివేసే చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. ఒక్క అరకులోయ నియోజకవర్గంలో 2191 మంది దివ్యాంగులు ఉండగా వీరిలో 463 మంది దివ్యాంగులకు పింఛన్లు నిలిపివేయడం సరికాదన్నారు. వీరికి ప్రభుత్వం వీరికి న్యాయం చేసే వరకు వారి పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
అన్నివర్గాలకు అన్యాయం
కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ, గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హమీ ఇచ్చిన చంద్రబాబు అఽధికారంలోకి వచ్చాక మాట తప్పి గిరిజనులకు అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కాఫీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు అమలుజేశామన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం మైదాన ప్రాంతమైన మాకవరపాలెంలో కాఫీ యార్డులు, క్యూరింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం డౌనూరు, జి.మాడుగులలో చేపట్టిన కాఫీ క్యూరింగ్ సెంటర్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
మహిళలకు రక్షణ కరువు
రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు,మహిళలపై ఆత్యాచారాలు, హత్యలు, అగాయిత్యాలు,దాడులు అధికమయ్యాయని.. హోంమంత్రిగా అనిత మహిళ అయినప్పటికీ మహిళలకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుశం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను తీవ్రంగా ఇబ్బందులు, వేధింపులకు గురిచేస్తున్నా హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. మద్యం పాలసీలో ఎలాంటి అక్రమాలు లేకపోయినా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభు త్వం మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేసిందని, ఆదాయమే లక్ష్యంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు, రాత్రి 12 గంటల వరకు ప్రజలు తాగేలా బార్‌లను ప్రోత్సహించడం అన్యాయమన్నారు.
అభివృద్ధి శూన్యం
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పీఎం జన్‌మన్ పథకంతో కేంద్ర ప్రభుత్వం
అర్హత ఉన్నా పింఛన్ల తొలగింపు దారుణం
గిరిజన ప్రాంతాల సమస్యలపై
వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర ధ్వజం