
మద్యం మత్తులో ఉపాధ్యాయుడు
● రోడ్డుపై పడిపోయిన వైనం
● వాట్సాప్ గ్రూపుల్లో వైరల్
కొయ్యూరు: సమాజానికి మార్గ నిర్దేశం చేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు పట్టపగలే మద్యం మత్తులో రోడ్డుపై పడి ఉండటం విమర్శలకు దారి తీసింది. మండలంలోని ఎం.మాకవరం పంచాయతీ నడింపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అప్పారావు మద్యం మత్తులో పడిపోయారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో బుధవారం వైరల్ అయ్యాయి. అసలు పాఠశాలకు ఆ ఉపాధ్యాయుడు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల చదువులు సాగకపోయినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
చర్యలు తీసుకుంటాం: ఎంఈవో రాంబాబు
మద్యం సేవించి విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో రాంబాబు బుధవారం రాత్రి తెలిపారు .మంగళవారం తాను తనిఖీకి వెళ్లినప్పుడు ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ఉన్నారన్నారు. ఆతని స్థానంలో మరో ఉపాధ్యాయుడిని నియమించామని తెలిపారు. విద్యార్థులు చదువుకు ఆటంకం లేకుండా చేస్తున్నామన్నారు.

మద్యం మత్తులో ఉపాధ్యాయుడు