
కొట్టుకుపోయిన అప్రోచ్ బ్రిడ్జి
చింతపల్లి: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలోని రాజుపాకలు వద్ద ఏర్పాటుచేసిన అప్రోచ్ బ్రిడ్జి ఆదవారం కొండవాగు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వా హన చోదకులు ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలో నడిచే విశాఖపట్నం–హైదరాబాద్, విశాఖపట్నం –భద్రాచలం, విజయనగరం–భద్రాచలం ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే ఘాట్ మార్గంలో తురబాడ వద్ద కొండగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

కొట్టుకుపోయిన అప్రోచ్ బ్రిడ్జి