
అక్రమ మద్యం, సారా స్వాధీనం.. నలుగురి అరెస్టు
చింతపల్లి: ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లు, నాటు సారాను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జె.కూర్మారావు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులకు అందిన ముందుస్తు సమాచారం మేరకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కోరుకొండ గ్రామంలో దాడులు నిర్వహించామన్నారు. ఒడిశాకు చెందిన 40 లీటర్ల మద్యం సీసాలు, 409 లీటర్ల నాటు సారా, ఆంధ్రాకు చెందిన 25 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటికి సంబంధించిన వారా రాజు, ఒర్ల సూరిబాబు, షేక్ మహమ్మద్ రఫీ, వల్లంగి రమణబాబును అరెస్టు చేసినట్టు ఆయన వివరించారు. ఒడిశాలోని జనతాబై గ్రామానికి చెందిన రాఖేష్ కుమార్ సింగ్ (శివ) ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా గుర్తించి, అతనిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే అతనిని కూడా అరెస్టు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, ఎస్‌ఐలు గిరిబాబు, వీర్రాజు, సిబ్బంది సంతోష్, రమేష్ పాల్గొన్నారని ఆయన తెలిపారు.