
అరకు ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాల్గుణ ఔదార్యం
డుంబ్రిగుడ: మండలానికి చెందిన కొర్ర, కించుమండల ఎంపీటీసీ గుజ్జెల విజయ అత్తమామలు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, గుజ్జెల చిరంజీవి తల్లిదండ్రులు గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అరకులోయ ఎంపీ గుమ్మ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణలు ఫోన్ ద్వారా వారి యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారు బాధితులకు రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించినట్లు చిరంజీవి దంపతులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం చికిత్స పొందుతున్న రామరావు, పుణ్యవతిలకు డిశ్చార్జ్ చేసి స్వగ్రామం కొర్ర తరలించారు.