ప్రపంచ తెలుగు సాహితీసంబరాల పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ తెలుగు సాహితీసంబరాల పోస్టర్‌ ఆవిష్కరణ

Apr 30 2025 1:49 AM | Updated on Apr 30 2025 1:49 AM

ప్రపంచ తెలుగు సాహితీసంబరాల పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రపంచ తెలుగు సాహితీసంబరాల పోస్టర్‌ ఆవిష్కరణ

సీలేరు: అంతర్జాతీయ సాహితీ సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఏలూరులో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు పోస్టర్‌ను జి.కె.వీధి మండలం సీలేరు గ్రామ సర్పంచ్‌ పాంగి దుర్జో, కళావేదిక అధ్యక్షుడు నూనె రమేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పాంగి దుర్జో మాట్లాడుతూ కళావేదిక నిర్వహిస్తున్న సాహితీ, సామజిక సేవలను కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి, కవులను ప్రోత్సహించి తెలుగు భాష పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ బత్తుల విజయకుమారి, లింగేటి లోవకుమారి, మహిళా పోలీసు సోమెళ్ల రేవతి, సబార్డినేట్‌ దేవు ప్రకాశరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement