
● గుర్రపు డెక్క.. పూసెను ఎంచక్కా
● చాపరాయిలో కోలాహలం
● మంచు అందాలు.. మనసు దోచే
చాపరాయి జలవిహారిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. గత మూడు వారాలుగా చాపరాయిని అంతంత మాత్రంగానే పర్యాటకులు సందర్శించారు. ఈ వారం పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇక్కడ వ్యాపారం చేసుకునే గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అరకు పైనరీని కూడా పర్యాటకులు సందర్శించారు. – డుంబ్రిగుడ
మంచు అందాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి. అరకు రైల్వేట్రాక్, అరకు గ్రామం, జయపూర్ జంక్షన్, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో ఆదివారం దట్టంగా మంచుకురిసింది. తెల్లవారు జాము నుంచి భారీగా కురుస్తున్న పొగమంచులో పర్యాటకులు ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు. – డుంబ్రిగుడ
ముంచంగిపుట్టు అంబేడ్కర్ పార్కు సమీపంలో ఉన్న చెరువులో గుర్రపు డెక్క పూలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. చెరువు మొత్తం పూలతో నిండిపోయింది. పచ్చని ఆకుల మధ్య తెలుపు,నీలం రంగులతో పూసిన పూలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. – ముంచంగిపుట్టు

● గుర్రపు డెక్క.. పూసెను ఎంచక్కా

● గుర్రపు డెక్క.. పూసెను ఎంచక్కా