నల్లబెల్లం విక్రయాలపై నిబంధనలు పాటించాలి
అడ్డతీగల: ఐదు కిలోలకు మించి నల్లబెల్లం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగరాహుల్ అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అడ్డతీగలలో కిరాణా వ్యాపారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మొత్తంలో నల్లబెల్లం అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా సారా తయారీ, విక్రయాలపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బెల్లం డీలర్లు అనుమతి పత్రం కలిగి ఉండాలన్నారు. అనుమతి పత్రాలు లేకుండా బెల్లం కొనుగోళ్లు, విక్రయాలు చేయవద్దన్నారు. బెల్లం నిల్వ ఉంచినా చర్యలు తీసుకుంటామన్నారు.నల్లబెల్లం ఎక్కువ మోతాదులో రవాణా చేస్తున్నా లేక నిల్వ చేసినా విక్రయించినా అటువంటి సమాచారం ఇవ్వాలని ఎకై ్సజ్ సిఐ శ్రీధర్ అన్నారు.


