ట్యూనా టైమ్.. సముద్రం ఇచ్చిన బహుమతి
మహారాణిపేట(విశాఖ): కూటి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. ఆదివారం భారీ సంఖ్యలో ట్యూనా చేపలు చిక్కాయి. సముద్రంలో లభించిన ఈ చేపలను మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. వలలకు చిక్కిన ట్యూనా చేపలు ఒక్కోటి దాదాపు 10 నుంచి 20 కిలోల బరువు ఉండటంతో వారిలో ఆశలు చిగురించాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఆ చేపలను ముక్కలుగా కోసి ఎగుమతులకు అనువుగా సిద్ధం చేశారు. ట్యూనా చేపలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ట్యూనా చేపలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా కేరళ, చైన్నె ప్రాంతాల ప్రజలు వీటిని ఎంతో ఇష్టంగా భుజిస్తారు. 6 అడుగుల నుంచి 15 అడుగుల వరకు పెరిగే ఈ చేపలకు మంచి ధర పలుకుతుండటంతో ఫిషింగ్ హార్బర్‌లో సందడి నెలకొంది. చేపలను ఐస్‌తో నింపిన వ్యాన్లు, కంటైనర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు.


