పర్యాటక రంగానికి ట్రాఫిక్ బ్రేక్
ఆదాయంపై తీవ్ర ప్రభావం చాపరాయి, అరకు పైనరీ, లంబసింగి, చెరువులవెనంకు అంతంతమాత్రంగా పర్యాటకులు
ట్రాఫిక్ ఆంక్షల ప్రభావం పర్యాటక రంగంపై చూపుతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అరకు పైనరీ, జలవిహారి, లంబసింగి, చెరువులవెనంకు పర్యాటకుల రాక తగ్గుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక కుటుంబాలు ఆదాయం లేక విలవిల్లాడు తున్నాయి. ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షలను సరళీకృతం చేయాలని, లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని వారు కోరుతున్నారు.
చెరువులవెనం వ్యూపాయింట్ వద్ద
అంతంతమాత్రంగా పర్యాటకులు
డుంబ్రిగుడ: మండలంలోని చాపరాయి, అరకు పైనరీకి అంతంతమాత్రంగా పర్యాటకులు వచ్చారు. ప్రభుత్వం, అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో దీని ప్రభావం పర్యాటకుల రాకపై చూపింది. దీనివల్ల ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలు ఆదాయం కోల్పోతున్నాయి.
చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి అంతంతమాత్రంగా పర్యాటకులు వచ్చారు. లంబసింగి జంక్షన్‌కు సమీపంలో పాలసముద్రాన్ని తలపించే చెరువులవెనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు.
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, డుడుమ జలపాతానికి ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు కావడంతో పిల్లలతో కుటుంబ సమేతంగా విచ్చేశారు.డుడుమ జలపాతం పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం కనిపించింది. ప్రకృతి అందాలను చూసి మంత్రముగ్ధులయ్యారు.
చాపరాయి జలవిహారి సందర్శనకు తక్కువ సంఖ్యలో వచ్చిన పర్యాటకులు
పర్యాటక రంగానికి ట్రాఫిక్ బ్రేక్
పర్యాటక రంగానికి ట్రాఫిక్ బ్రేక్
పర్యాటక రంగానికి ట్రాఫిక్ బ్రేక్


