రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లకు తీవ్ర గాయాలు
హుకుంపేట: మండలంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెలు తీవ్రంగా గాయపడ్డారు. అరకు–పాడేరు జాతీయ రహదారిలో అడ్డుమండ జంక్షన్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అక్కాచెల్లెలు మంచాల చైతన్య, శ్రీలక్ష్మి శనివారం స్కూటీపై అరకు అందాలను తిలకించారు. అక్కడి నుంచి పాడేరు మండలం వంజంగి కొండకు వెళ్తుండగా మండలంలోని అడ్డుమండ జంక్షన్ వద్ద అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టారు. ఈ ఘటనలో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న సీఐ సన్యాసినాయుడు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సమాచారాన్ని వెంటనే క్షతగాత్రుల కుటుంబాలకు ఫోన్‌లో తెలియజేశారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమని తెలుసుకున్న సీఐ సొంతూరు వెళ్లేందుకు అవసరమైన నగదు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు.
అక్కాచెల్లెళ్లకు వైద్యం అందిస్తున్న సిబ్బంది
క్షతగాత్రులతో మాట్లాడుతున్న సీఐ సన్యాసినాయుడు
క్షతగాత్రులు అన్నమయ్య జిల్లా వాసులు
రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లకు తీవ్ర గాయాలు


