కోడి పందాలు, జూదం నిర్వహిస్తే చర్యలు
చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా
చింతపల్లి: సంక్రాంతి పండగ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా కోడిపందాలు, పేకాట, చిత్తులాట వంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా హెచ్చరించారు. శనివారం చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల పరిధిలో ప్రత్యేకంగా వీటిపై నిఘా కొనసాగుతుందన్నారు. మన్యంలో సంప్రదాయం పేరుతో కొన్ని చోట్ల కోడిపందాలను, పేకాటలను నిర్వహించడం ఆనవాయితీగా ఉందన్నారు. సంప్రదాయం ముసుగులో ఈఅసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వీటికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈకార్యక్రమంలో చింతపల్లి సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.


