మోదకొండమ్మను దర్శించుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు
పాడేరు : ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి, పాడేరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, పార్టీ పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు ఏడువాక సత్యారావు, తదితరులు శనివారం పాడేరు మోదకొండమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం వీరిని ఆలయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఇతర ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి చిత్రపటం అందజేశారు.


