వైఎస్సార్‌సీపీ పటిష్టతే లక్ష్యం
పాడేరు: వైఎస్సార్‌సీపీ గ్రామ గ్రామాన మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టించి పని చేయాలని, రానున్న ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ జెండాను రెపరెపలాడించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. శనివారం పార్టీ స్థానిక కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షతన పార్టీ జిల్లా స్థాయి సంస్థాగత నిర్మాణంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా నేటి నుంచే కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా ఎదగడానికి సమష్టి కృషితో పని చేయాలని కోరారు. ఎమ్మెల్సీ, టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి వరుదు కల్యాణి మాట్లాడుతూ పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసేందుకు తక్షణమే గ్రామ, పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సభ్యుల వివరాలను డిజిటలైజేషన్ చేయాల్సిన బాధ్యత మండల పార్టీ అధ్యక్షులపై ఉందని ఆమె స్పష్టం చేశారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృఢనిశ్చయంతో ఉన్నారన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుదామన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలకు కూడా తగిన గుర్తింపు, గౌరవం దక్కే రోజులు ముందున్నాయన్నారు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి బలోపేతానికి కృషి చేయాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తుందన్నారు. పార్టీకి ఆయవుపట్టు కార్యకర్తలేనని, ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడిపనిచేసే ప్రతి కార్యకర్తకు సముచితస్థానం ఉంటుందన్నారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామస్థాయి కమిటీల నియామకాలు వేగవంతం చేయాలని కోరారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, తదితరులు ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడారు. అనంతరం సంస్థగత నిర్మాణంలో భాగంగా మండల స్థాయి సమావేశాలకు తేదీలను ఖరారు చేశారు. మండల స్థాయి అనంతరం గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు ఏడువాక సత్యారావు, జిల్లాలోని పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ ఉపాధ్యక్షులు, ముఖ్యమైన క్యాడర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అరకు ఎంపీతనూజరాణి, ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం
కార్తకర్తలే అసలైన బలం
స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ధ్యేయం
త్వరలో మండల, గ్రామస్థాయి
సమావేశాలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం: అరకు ఎంపీ తనూజరాణి
పార్టీ శ్రేణులకు మంచి రోజులు
జిల్లా స్థాయి పార్టీ సంస్థగత నిర్మాణంపై పాడేరులో కీలక సమావేశం
వైఎస్సార్‌సీపీ పటిష్టతే లక్ష్యం
వైఎస్సార్‌సీపీ పటిష్టతే లక్ష్యం
వైఎస్సార్‌సీపీ పటిష్టతే లక్ష్యం
వైఎస్సార్‌సీపీ పటిష్టతే లక్ష్యం


