మన్యంలో విస్తారంగా వర్షాలు | Sakshi
Sakshi News home page

మన్యంలో విస్తారంగా వర్షాలు

Published Mon, May 20 2024 11:25 AM

మన్యం

అనంతగిరిలో రోడ్డుపైకి వరదనీరు

సాక్షి,పాడేరు: ఏజెన్సీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి పాడేరులో వర్షం కురుస్తూనే ఉంది. ఖరీఫ్‌కు ఎంతో అనుకూలమని రైతులు తెలిపారు. లోతట్టు భూముల్లో వరద నీరు చేరుతోంది. ప్రధాన మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం పెరిగింది.

అనంతగిరి: మండల కేంద్రంలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఏకదాటిగా కురిసిన వర్షానికి రోడ్లపైకి వరదనీరు వచ్చేసింది. ఉదయం ఎండతీవ్రత.. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో మండల ప్రజలకు వేసవి తాపంనుంచి ఉపశమనం పొందుతున్నారు.

గూడెంకొత్తవీధి: మండల కేంద్రం గూడెంకొత్తవీధిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ కాసింది. ఆ తరువాత ఉరుములు, మెరుపులతో సుమారు మూడున్నర గంటలపాటు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొద్దిసేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మన్యంలో విస్తారంగా వర్షాలు
1/1

మన్యంలో విస్తారంగా వర్షాలు

Advertisement
 
Advertisement
 
Advertisement