నస్పూర్: అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితుల వివరాల నమోదుకు సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆన్లైన్ నమోదు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిపాజిటర్లు, బాధితుల బాండ్లు, రశీదులు, వారి వివరాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. నాలుగు కౌంటర్ల ద్వారా ప్రతీరోజు సుమారు 250 మంది వివరాలను ఆన్లైన్లో నమోదుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికారులు తెలిపిన తేదీల్లో మాత్రమే ఆయా జిల్లా, మండలాల బాధితులు రావాలని సూచించారు. బుధవారం ఆదిలాబాద్ అర్బన్‌కు చెందిన సుమారు 60మంది బాధితుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, ఈ ప్రక్రియ మార్చి 2027 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సీఐ వై.కృష్ణారెడ్డి, సీఐడీ ఎస్సైలు నరేశ్, రాజ, తదితరులు పాల్గొన్నారు.


