ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పోటీల్లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించనున్న పోటీల్లో వీరు పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారిలో సాయి సాత్విక్, సుశాంత్ యాదవ్, తేజ్ చరణ్, సాయి హర్షిత్, శ్లోక్ ఉన్నారు. కోచ్ కొమ్ము కృష్ణ, డీవైఎస్వో దయానంద రెడ్డి, డీటీఎస్వో పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి తదితరులు విద్యార్థులను అభినందించారు.


