నార్నూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా దృష్టి సారించాలని డీఈవో మాధవి అన్నారు. మండలంలోని ప లు ప్రభుత్వ పాఠశాలలను బుధవారం తనిఖీ చేశారు. తొలుత భీంపూర్ జెడ్పీహెచ్ఎస్ను తనిఖీ చేసి, విద్యాబోధన తీరును పరిశీలించారు. అనంతరం నార్నూర్ ఎంపీపీఎస్(ఎస్సీ)లో విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సమయపాలన పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆమె వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


