ఉట్నూర్‌రూరల్: గిరిజన విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల్లో ఏఎక్స్‌ఎల్–ఏఐ ఆధారిత డిజి టల్ విద్య కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్‌సీ సమావేశ మందిరంలో కార్యక్రమం అమలుపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు, డిజిటల్ లెర్నింగ్, ఐసీటీ ఆధారిత బోధనా పద్ధతులను తరగతి గదుల్లోకి తీసుకువచ్చి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించనున్నట్లు తెలిపారు. సంప్రదాయ బోధనా పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా, అర్థవంతంగా పాఠ్యాంశాలను బోధించడ మే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. స్టేట్ రిసో ర్స్ పర్సన్స్, ఏసీఎంవోలు, జీసీడీవోలు తదితర విద్యాశాఖ సిబ్బంది భాగస్వామ్యంతో శిక్షణ, పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో ఐటీడీఏ డీడీ అశోక్, ఏజెన్సీ అదనపు విద్యాధికారి చందన్, ఐటీడీఏ ఆయా శాఖల అధి కారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో మంద మకరందు


