తానూరు: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఒకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. ముధోల్ మండలంలోని వడ్తాల్ గ్రామానికి చెందిన గాజుల పండరి (42) ఇటీవల నూతన ట్రాక్టర్‌తోపాటు పరికరాలు కొనుగోలు చేశాడు. నలుగురు కుమార్తెల చదువుకయ్యే ఖర్చులకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి భోజవ్వ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.


