తలమడుగు: గిరిజన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దేవపూర్, చేర్లపల్లి, ఝరీ, పూనగూడ, రత్నాపూర్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూనగూడ నుంచి రత్నాపూర్‌కు రోడ్డు మంజూరైనా పనులు పూర్తి చేయలేదన్నారు. వర్షాకాలంలో ప్రజలు కొండపైకి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గిరిజన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెట్టి మనోజ్, అర్కా శేషారావు, కుముర జ్ఞానేష్, ఆత్రం భరత్, జంగల పోచన్న, గోడం భుజంగరావు, పెందూర్ మాధవరావు, అనక రాంజీ, సర్పంచులు ఆత్రం సూర్యబాన్, ఆత్రం అశోక్, తొడసం హేమంత్, తదితరులు పాల్గొన్నారు.


