ఖానాపూర్: పట్టణంలోని జగన్నాథరావు చౌరస్తాలో గురువారం కారు అదుపుతప్పి డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. దీంతో కారును బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు పూర్తికాకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆటో బోల్తాపడి
ఇద్దరికి గాయాలు
ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ ఘాట్ రో డ్డులో గురువారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన సంఘటనలో మహారాష్ట్రలోని చికిలి గ్రామానికి చెందిన ఇద్దరికి గాయాలయ్యా యి. కిన్వట్ తాలుకాలోని చికిలి గ్రామానికి చెందిన కొంతమంది ఇచ్చోడ మండలంలోని గుండాలకు పెళ్లి చూపులకు ఆటోలో బయలుదేరారు. సిరిచెల్మ ఘాట్ రోడ్డులో ప్రమాదవఽశాత్తు ఆటో బోల్తాపడడంతో అందులో ప్ర యాణిస్తున్న రిజ్వాన, షేక్‌సబ్దార్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించినట్లు ఈఎంటీ సిద్దేశ్వర్, పైలట్ బాపుసింగ్ తెలిపారు.
నిందితుడి అరెస్ట్
భీమిని: భీమిని పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న రామటెంకి శ్రీకాంత్‌ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై కోటేశ్వర్ తెలిపారు. సదరు నిందితుడు కోర్టు వాయిదాలకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో న్యాయస్థానం నిందుతుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జ్యుడీషియ
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రాకాలనీలో గురువారం గుర్తు తెలియని వ్య క్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. మృతునికి 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని, మాసిపోయిన గడ్డం, బూడిదరంగు బట్టలు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్‌స్టేషల్ కస్టడీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.


