జైపూర్: మండలంలోని వేలాల మల్లన్న సన్నిధిలో గోదావరినది ఒడ్డున కొనసాగుతున్న పుష్కరఘాట్ నిర్మాణ పనులను గురువారం ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, డీఈ రామకృష్ణ, ఏఈఈ ప్రణీత్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. 2027లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తుండగా వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధితో పాటు పుష్కరఘాట్, సుందరీకరణ, రోడ్లు, విద్యుత్, తాగునీటి వంటి వసతుల కల్పనకు ఇప్పటికే ప్రభుత్వం రూ.14.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డేగ స్వప్న, నగేశ్, ఉపసర్పంచ్ సుందిళ్ల రాజలింగు, నాయకులు ఇప్పలపెల్లి బాపు, తదితరులు పాల్గొన్నారు.


