నిర్మల్‌చైన్‌గేట్: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, కొందరు వ్యక్తులు వైద్యులపై చేస్తున్న దుష్ప్రచారా న్ని ఐక్యతతో, మరింత అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ తిప్పికొట్టాలని ఇండియన్ మెడిక ల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి.విజయకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ ప్రాంగణంలో నిర్మల్ శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం రాత్రి నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా విజయకుమార్ హాజరై జ్యోతి ప్రజ్వల న చేసి, ఐఎంఏ ప్రార్థన, ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మల్ శాఖ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ జి.రమేశ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, కోశాధికారిగా డాక్టర్ కావేటి శ్రీకాంత్, మహిళా ప్రతినిధిగా డాక్టర్ అనిత రామకృష్ణతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ప్ర మాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డాక్ట ర్ విజయకుమార్ మాట్లాడుతూ వైద్యులకు, ప్రజల కు మధ్య సత్సంబంధాలు, ఆప్యాయత వెల్లివిరిసినప్పుడే రోగులకు సమర్థవంతమైన చికిత్స అంది ప్రజారోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అనంతరం విచ్చేసిన అతిథులకు జ్ఞాపికలు అందజే సి ఘనంగా సన్మానించారు. సేవా కార్యక్రమాలకు గానూ డాక్టర్ రామకృష్ణకు రాష్ట్ర ప్రత్యేక ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజేందర్, డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, ఐఎంఏ రాష్ట్ర నాయకులు సంజీవ్ కుమార్ యాదవ్, సీహెచ్.జగన్మోహన్‌రావు, టీవీ.శ్రీనివాస్, రామ్‌కిరణ్, యు. రామకృష్ణ, అప్పాల చక్రధారి, స్థానిక వైద్యులు మురళీధర్, ప్రమోద్, సీహెచ్.వేణుగోపాలకృష్ణ, జీకే.ప్రశాంత్, మెట్‌పల్లి ప్రభాకర్‌రావు, సురేశ్, రమణగౌడ్, దేవేందర్‌రెడ్డి, సుధీర్, మహేష్, సీహెచ్.శ్రీనివాస్, స్వర్ణరెడ్డి, ఆకుల విశాల్, జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


