వామ్మో.. మొసళ్లు | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. మొసళ్లు

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

● గోదావరిలో పెరుగుతున్న సంఖ్య ● తాజాగా ఆవుపై దాడి ● భయాందోళనలో రైతులు ●గతేడాది లక్ష్మణచాంద మండలం పార్‌పల్లి గ్రామంలోని ఊర చెరువులోకి మేతకు వచ్చిన కాసులను మొసలి పట్టింది. గమనించిన స్థానికులు స మాచారం ఇవ్వడంతో అక్కడే ఉన్న గోవర్ధన్‌ ధైర్యం చేసి కర్రతో మొసలిని కొట్టి కాసును రక్షించాడు. ●గతేడాది లక్ష్మణచాంద మండలం పీచర గ్రామంలోని ఊర చెరువులో ఒక మొసలి కనిపించడంతో రైతులు భయాందోళన చెందారు. ●ఖానాపూర్‌ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో గల బొడ్డుకుంట చెరువులో మొసలి కనిపించడంతో పశువుల కాపరులు, మత్స్యకారులు చెరువులోకి దిగేందుకు భయపడ్డారు. ●మునిపెల్లి గ్రామ సమీపంలో చెరువు వద్దకు మేకలు వెళ్లగా గమనించిన మొసళ్లు మందపై దాడి చేసి వాటిని తిన్నాయి. ●గోదావరి నది ఒడ్డున సోన్‌ గ్రామ సమీపంలోని రోడ్డుపై భారీ మొసలి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు.

కడెం/లక్ష్మణచాంద: గోదావరి నదిలో మొసళ్లు రైతులను టెన్షన్‌ పెడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఆహారం, నీళ్ల కోసం మొసళ్లు బయటకు వచ్చి సమీప చెరువులు, వాగుల్లోకి చేరుతున్నాయి. దీంతో గోదావరి పరీవాహక మండలాలైన నిర్మల్‌ జిల్లాలోని బాసర, లోకేశ్వరం, కడెం, సోన్‌, దిలావర్‌పూర్‌, లక్ష్మణచంద పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు, పశువుల కాపరులు, మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు.

మత్స్యకారులకు ముప్పు

గోదావరి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా మొసళ్ల సంచారం పెద్ద ముప్పుగా మారింది. ఎప్పుడు, ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.

తరలింపు కోసం విజ్ఞప్తి

జనావాసాల సమీపంలోని చెరువుల్లోకి చేరిన మొసళ్లను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు లేదా గోదావరి లోతట్టు ప్రాంతాలకు తరలించాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ప్రాణనష్టం జరగకముందే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తగి న రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నిర్మల్‌ జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు

ఆవుపై దాడి

బుధవారం కడెం మండలం సారంగపూర్‌ గ్రామానికి చెందిన సార్ల రాజేందర్‌ ఆవులను గోదావరి సమీపానికి మేతకు తీసుకెళ్లారు. నీటి కోసం మడుగులోకి వెళ్లిన ఒక ఆవుపై పెద్ద మొసలి దాడి చేసింది. ఆవును నీటిలోకి లాగే ప్రయత్నంలో అది తప్పించుకుంది. అయితే కాసేపటికి ఆవు చనిపోయింది. గతంలో ఖానాపూర్‌ పట్టణంలోని బొడ్డొనికుంటలో మొసలి సంచారం కనిపించడంతో అటవీ అధికారులు దానిని పట్టుకుని సమీప గోదావరినదిలో వదిలిపెట్టారు. ఈ సంఘటనలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. పొలాలు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని, మూగజీవాలను కాపాడుకోవడం కష్టమైందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement