ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

ఇంద్రవెల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ముత్నూర్‌ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఉట్నూర్‌ సీఐ మడావి ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దౌవల్కర్‌ హేమంత్‌ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, చిన్న కూతురు పెళ్లి ఎలా చేయాలనే విషయమై కుటుంబ సభ్యుల వద్ద ఆందోళన వ్యక్తం చేశాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రించాడు. గురువారం ఉదయం ఇంటి ముందు షెడ్డు ముందు హేమంత్‌(50) ఉరి వేసుకున్నాడు. ఆయన భార్య కమల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement