బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రం అప్పులపాలు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రం అప్పులపాలు

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

● రైతుల పేరుతో రాజకీయం మానండి ● ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. రై తుల పేరుతో రాజకీయం మానాలని హితవు పలి కారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అ వకాశం ఉందని ప్రభుత్వం ముందుగానే రైతులను అప్రమత్తం చేసిందని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు చేసుకోవాలని సూచించిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రభుత్వంపై నెట్టడం కేటీఆర్‌ రాజకీయ వైఖరికి నిదర్శనమన్నారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ప్రచారం చేసుకుందే తప్ప, రాష్ట్రానికి మిగిల్చింది అప్పుల భారమని విమర్శించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేసిన అప్పులు, ప్రజలకు అందించిన ప్రయోజనాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని సవాల్‌ విసిరారు. కుటుంబ రాజకీయాలు, అధికారం కోసం ఆరాటం పక్కనపెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో నిర్మల్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ ఆకుల హరీష్‌, ఖానాపూర్‌ ఏఎంసీ చైర్మన్‌ పడగల భూషణ్‌, డీసీసీ జనరల్‌ సెక్రటరీ జునైద్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు సమరసింహా రెడ్డి ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు కట్టే శ్యామ్‌, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement