కుంటాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వినూత్న బోధనా పద్ధతులు, అంతర్జాతీయ విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు వానల్ పహాడ్ ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న. ఈ నెల 14న హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో గల ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, జవహర్ బాల భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ఎల్లన్న ఎంపికయ్యారు. జపాన్, సింగపూర్, వియత్నాం, ఫిన్లాండ్ దేశాలను సందర్శించి వచ్చిన ఉపాధ్యాయ ప్రతినిధులతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో సింగపూర్ విద్యా పర్యటన బృందం నుంచి మాదరి ఎల్లన్న తన అనుభవాలను, కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించే అవకాశం వచ్చిందని తెలి పారు. ఎల్లన్నను డీఈవో భోజన్న, మండ ల విద్యాధికారి, ఉపాధ్యాయులు అభినందించారు.


