మౌలిక వసతుల కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

ఆదిలాబాద్‌రూరల్‌: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని భీంసరి గ్రామంలో రూ.70లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్‌ రూరల్‌ మండల ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు చేయూత పింఛన్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా పింఛన్‌ రానివారిలో అర్హులుంటే దరఖాస్తు చేయించాలని సర్పంచులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, డీపీవో రమేశ్‌, ఎంపీడీవో వంశీవృష్ణ, ఎంపీవో ఆనంద్‌, సర్పంచ్‌ కార్తిక్‌, నాయకులు మయూర్‌ చంద్ర, దయాకర్‌, దత్తు, ఆశ రెడ్డి, సత్యం, వెంకన్న, శ్రీకాంత్‌, జీవన్‌, గంగాధర్‌, ప్రభాకర్‌ తదితరులున్నారు.

కోట సంబరాలకు రూ.7లక్షలు

కైలాస్‌నగర్‌: ఉట్నూర్‌ కోటలో నిర్వహించనున్న సాంస్కృతిక సంబరాలకు ప్రభుత్వం రూ.7లక్షల నిధులు విడుదల చేసినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో నిధులు విడుదలైనట్లు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement