‘మాలలకు అన్యాయం చేస్తున్న సర్కారు’ | - | Sakshi
Sakshi News home page

‘మాలలకు అన్యాయం చేస్తున్న సర్కారు’

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

కై లాస్‌నగర్‌: ఎస్సీ వర్గీకరణ పేరిట రోస్టర్‌ పాయింట్లు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్‌ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాలలకు న్యా యం చేయాలనే డిమాండ్‌తో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌ పాయింట్ల లో మాలలకు 10లోపు ఒకటి, 11 నుంచి 20లోపు రెండు రోస్టర్‌ పాయింట్లు కేటాయించాలని కోరా రు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వ మెమో 1928ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మాలలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. మాలలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement