కైలాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. రూ.54 కోట్ల వ్యయంతో నిర్మించిన దీనిని తొ లుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారనే ప్రచా రం సాగింది. అయితే ఈ నెల 9న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చే తుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు టీజీ ఐఐసీ అధి కారులు టవర్‌ను అన్నిహంగులతో సుందరంగా ము స్తాబు చేశారు. ప్రత్యేకంగా ఆహ్వానపత్రాలు ముద్రించి జిల్లా ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులను కలిసి అందజేశారు. ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేపడుతుంటే యువతకు దీపావళి కానుకగా టవర్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తారని జిల్లావాసులు ఆశగా ఎదురుచూశారు. అయితే ప్రారంభోత్సవ ప్రక్రి య వాయిదా పడింది. 9న హైదరాబాద్‌లోని హకీంపేటలో ఎల్‌నినో నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునే చర్యలపై సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులంతా ఆ సమావేశంలో పాల్గొనాల్సి ఉండటంతో టవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు ప్రారంభిస్తారనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీజీఐఐసీ అఽధికారులు చెబుతున్నారు.


