రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి

Nov 8 2026 12:13 AM | Updated on Nov 8 2026 12:13 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

● కలెక్టర్‌ రాజర్షి షా

కైలాస్‌నగర్‌: ఎల్‌నినో ప్ర భావంతో పంట నష్టపోయిన రైతులకు భరోసాతోపాటు రుణాల రీషె డ్యూలింగ్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాజ ర్షిషా అధికారులను ఆదేశించారు. రైతుఆత్మహత్య లని వారణకు గ్రామస్థాయిలో విస్తృత ప్రచార కా ర్యక్రమాలు చేపట్టాలన్నారు. సంబంధిత శా ఖల అధికారులతో శనివారం జూమ్‌ ద్వారా సమీ క్షించారు. 33 శాతానికి పైగా పంట నష్టం జరి గిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ వేగంగా సేకరించి సమగ్ర నివేదిక రూపొందించాల ని ఆదేశించారు. రైతులు తీసుకున్న పంట రు ణాలను బ్యాంకుల ద్వారా రీషెడ్యూల్‌ చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ వెసులుబాటుపై రైతులకు పూర్తి స్థా యిలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యాదర్శుల ద్వారా దండోరా వే యించాలని డీపీవోను ఆదేశించారు. అనంతరం పింఛన్‌ దరఖాస్తులు, దివ్యాంగుల యూ డీఐడీ ధ్రువీకరణ పత్రాలు, బీడీ కార్మికుల పింఛన్లపై సమీక్షించారు. అనర్హులు, సందేహాస్పదంగా ఉన్న కేసులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరి శీలించి, పారదర్శకంగా విచారణ జరపాలని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మీట్‌లో డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, డీపీవో రమేశ్‌, డీఏవో రవీందర్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement