ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవా ధృక్పథం, నాయకత్వ లక్షణాలు అలవడేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దో హదం చేస్తుందని విద్యాశాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకం, ఫౌండేషన్ డే స్టిక్కర్లను ఆవిష్కరించారు. బెడెన్ పావెల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది జిల్లాలో 64 పాఠశాలల్లో కొత్త యూ నిట్ల ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లా కార్యదర్శి ఎన్. స్వామి, ఉపాధ్యక్షులు ఆదినాథ్, దేవేందర్ పా టస్కర్, కోశాధికారి మోహన్‌బాబు, జిల్లా స్కౌట్స్ కమిషనర్ శాస్త్రి, డీటీసీ నాగిరెడ్డి, గైడ్ కెప్టెన్ అస్మా షాహీన్, స్కౌట్స్,గైడ్స్ పాల్గొన్నారు.


