గుజరాతీలు ఇలా..
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే గుజరాతీలు ఈ పండుగను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ధన్‌తేరస్‌తో సందడి ప్రారంభమవుతుంది. ఇళ్లను రంగోలీలతో అలంకరించి, దీపాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. పండుగ రోజున లక్ష్మీదేవి, గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంపద, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తారు. వ్యాపారులు లక్ష్మీపూజతో పాటు కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు.
డొంగర్గాంలో గుస్సాడీ, కోలాట నృత్యాలతో సందడి
ఈ పండుగ వచ్చిందంటే జిల్లాలోని ఆదివాసీ గ్రామాలు దండారీ ఉత్సవాలతో సందడిగా మారుతాయి. గిరిజనులు తమ ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ గుస్సాడీ నృత్యాలతో కాలుకదుపుతారు. యువకులు, మహిళలు బృందాలుగా ఏర్పడి సంప్రదాయ వేషధారణతో ఆకట్టుకుంటారు. నెమలి ఈకలతో అలంకరించిన టోపీలు, తలపాగాలు, కృత్రిమ మీసాలు, గడ్డాలు, జింక లేదా మేక చర్మాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. డప్పు, పేప్రే, తుడుం, కాలికోం వంటి సంప్రదాయ వాయిద్యాల నడుమ అడుగులు వేస్తూ గ్రామాల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తారు. దండారీ ప్రారంభ రోజును భోగిగా భావించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. బేటికోలా, మానుకోల, సదర్కోలా, కోడల్కోలా, కలివల్కోలా వంటి వివిధ రకాల నృత్యాలను ప్రదర్శిస్తారు. దీపావళి అనంతరం కోలబోడి వేడుకలతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. చివరి రోజు గ్రామ శివారులోని జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆభరణాలు కట్టి హారతులు ఇస్తారు.
బందీ ఛోర్ దివస్‌తో..
పంజాబీలు
పంజాబీలు ఈ పండుగను ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. సిక్కుల ఆరో గురువు గురు హరగోవింద్ సాహిబ్ మొఘల్ చెర నుంచి విడుదలైన సందర్భంగా బందీ ఛోర్ దివస్‌గా నిర్వహించుకుంటారు. గురుద్వారాలను వేలాది దీపాలు, విద్యుత్ కాంతులతో అలంకరిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, గురుబాణీ కీర్తనలు నిర్వహిస్తారు. కొందరు నాందేడ్ గురుద్వారాకు తరలివెళ్తుంటారు. ఇక ఇళ్లలో పిన్నీలు, లడ్డూలు, జిలేబీ, బర్ఫీ వంటి సంప్రదాయ మిఠాయిలను తయారుచేసి బంధుమిత్రులకు పంచుతారు.
గూడేల్లో.. గుస్సాడీ


