ఉద్యోగులకు ‘హెచ్‌ఆర్‌ఎంఎస్‌’ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ‘హెచ్‌ఆర్‌ఎంఎస్‌’

Nov 8 2026 12:13 AM | Updated on Nov 8 2026 12:13 AM

● సర్వీస్‌ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే ● ఇప్పటికే రికార్డుల డిజిటలైజేషన్‌ ● వచ్చే నెల నుంచి అమలుకు కసరత్తు ● నూతన విధానంపై డీడీవోలకు శిక్షణ

కై లాస్‌నగర్‌: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్‌ రికార్డు (ఎస్‌ఆర్‌)తో పాటు బదిలీ, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, సెలవుల మంజూరు వంటి సమగ్ర వివరాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో ఉండనున్నాయి. ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ తరహాలో ఈ వివరాల నమోదు కోసం ప్రభుత్వం ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌(ఎలక్ట్రానిక్‌ హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 1నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జిల్లాలోని డీడీవోలకు ట్రెజరీ శాఖ అధికారులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఆన్‌లైన్‌లో సేవలు..

ట్రెజరీలో మ్యానువల్‌ విధానానికి పూర్తిగాస్వస్తి పలి కే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే నూతన విధానాన్ని అమల్లోకి తెస్తుంది. సర్వీస్‌ రిజిస్టర్‌, ఇంక్రిమెంట్లు, బదిలీ, పదోన్నతులు, సెలువుల మంజూరు,దరఖాస్తు, ఇంక్రిమెంట్లు, జీపీఎఫ్‌, లీవులు, అప్లికేషన్‌ ఆన్యువల్‌ ప్రాపర్టీ, సెల్ఫ్‌ డిక్టరేషన్‌వంటి సేవలన్నింటినీ ఇకపై ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 9,492 మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అధికారులు డిజిటలైజేషన్‌ చేశారు.

జిల్లాలోని ఉద్యోగుల సమాచారం

సబ్‌ట్రెజరీ ఉద్యోగుల సంఖ్య

బోథ్‌ 1,691

ఉట్నూర్‌ 1,701

ఆదిలాబాద్‌ 6,090

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement