పారదర్శకంగానే ఎన్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగానే ఎన్‌హెచ్‌ఎం పోస్టుల భర్తీ

Nov 8 2026 12:13 AM | Updated on Nov 8 2026 12:13 AM

● డీఎంహెచ్‌వో సాధన

ఆదిలాబాద్‌టౌన్‌: జాతీయ హెల్త్‌మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పోస్టులకు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన చేపట్టిన ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం రోస్టర్‌ విధానంలోనే జరుగుతోందని డీఎంహెచ్‌వో సాధన అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోస్టుల నియామకానికి సంబంధించి మూడు రోజుల క్రితమే ప్రొవిజనల్‌ జాబితాను కార్యాలయంలో, అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎవరికై నా అభ్యంతరాలున్నా, పొరపాట్లు లేదా తప్పులు ఉన్నా సరిచూసుకోవడానికి అవకాశం కల్పించామని, దీనివల్ల పూర్తి పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. జాబితా విడుదలపై వస్తున్న కొన్ని అపోహలు నిజం కాదని, ఎలాంటి అవకతవకలకు తావులేదని స్పష్టం చేశారు. గతంలో నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ముందే ప్రెస్‌మీట్‌ ద్వారా ఎవరైనా డబ్బులు అడిగినా, ఇచ్చినా, లేదా ఎవరి పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడినా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రొవిజనల్‌ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, వాటిని మళ్లీ పరిశీలించి సవరించిన తుది జాబితాను జిల్లా సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే తుది మెరిట్‌ జాబితా ఖరారు చేయబడి, తుది నిర్ణయం తీసుకుని విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో ఎవరికై నా నిజంగా అన్యాయం జరిగినా లేదా అవకతవకలపై కచ్చితమైన ఫిర్యాదులు అందిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సమావేశంలో ఏవో నందిని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement