ఓటు హక్కు పునరుద్ధరణకు మరో అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పునరుద్ధరణకు మరో అవకాశం

Nov 8 2026 12:13 AM | Updated on Nov 8 2026 12:13 AM

● అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌

కై లాస్‌నగర్‌: ఎస్‌ఐఆర్‌ ముసాయిదా జాబితా నుంచి పేర్ల తొలగింపునకు గురైన వారు తమ ఓటుహక్కు తిరిగి పొందేందుకు ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించిందని అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌ అన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించి ఓటు హక్కు పునరుద్ధరించుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించిన వీసీలో కలెక్టరేట్‌ నుంచి ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏఎస్‌డీ జాబితాను ప్రతి పోలింగ్‌ కేంద్రం, గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై ప్రదర్శించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్‌స్థాయి ఏజెంట్లు, ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జాబితాలో పేర్లు ఉండి, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు నిబంధనల ప్రకారం ఫారం–సి ద్వారా మరోసారి ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా శ్రద్ధ వహించి ఈ నెల 21లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ఎన్నికల పర్యవేక్షణ అధికారి నలందప్రియ, నాయబ్‌ తహసీల్దార్‌ మధుసూదన్‌, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement