దండారీకి ప్రోత్సాహం ఏది? | - | Sakshi
Sakshi News home page

దండారీకి ప్రోత్సాహం ఏది?

Nov 8 2026 12:13 AM | Updated on Nov 8 2026 12:13 AM

● అరకొరగా సర్కారు సాయం ● రూ.లక్షల్లో ఖర్చులు..గిరిజనులకు భారం ● ఒక్కో బృందానికి రూ.50 వేలు పెంచాలని వేడుకోలు

కెరమెరి: ఆదివాసీ సంస్కృతి స ంప్రదాయానికి ప్రతీకగా నిలిచే దండారీ ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందడం లేదు. వీటి నిర్వహణకు గిరిజనులకు భారంగా మారాయి. గతంలో రూ.50 వేలతో ముగిసే ఉత్సవాలకు నేడు రూ.లక్ష దాటుతుంది. ఒక్కో దండారీకి ప్రభుత్వం అందించే రూ.15 వేల అరకొర సాయం ఎటు సరిపోక అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. కనీసం రూ. 50 వేలకు పెంచాలని నిర్వాహకులు, ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలు కోరుతున్నారు.

ఆతిథ్యం ప్రధానం

దీపావళి వేళ పదిరోజుల పాటు సాగే దండారీ ఉత్సవాల్లో పరస్పర ఆతిథ్యానిదే ప్రధానం. ఒక గూడెం దండారీ బృందం మరో గూడేనికి అతిథులుగా వెళ్లి కాళ్లు కడిగి సాదరంగా ఆహ్వానించడం ఆనవాయితీ. పొరుగు గ్రామం నుంచి వచ్చే దండారీకి టీ, టిఫిన్‌, రెండు పూటలు భోజన వసతికి రూ.20 వేల నుంచి 30 వేలు ఖర్చవుతుంది. అతిథులు పెరిగితే వ్యయం రెట్టింపవుతుంది. ఒక్కో గ్రామానికి రెండు, మూడు బృందాలు వస్తే రూ. 50 వేలు దాటుతాయి.

గుస్సాడీ వేషధారణకు రూ.వేలల్లో ఖర్చు

గుస్సాడీ వేషధారణకు సమకూర్చుకోవాల్సిన ప్రతి వస్తువు ఖరీదైనది. నెమలిపింఛాల టోపీ, రకరకాల పూసల మాలలు, జింక చర్మం, నడుముకు, కాళ్లకు కట్టే భారీ గజ్జెలకు రూ.20 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తుంది. లయబద్ధంగా శబ్దాలు చేసే సంప్రదాయ డప్పు ఒక్కొక్కటి తయారీకి రూ. 3 వేలు ఖర్చవుతుంది. పాత వాటికి సరిచేయిస్తే మరో రూ.వెయ్యి అవుతోంది. బృందంలో నృత్యం చేసే పోరీల(వేషధారణ) ఆభరణాల కోసం ఒక్కొక్కరికి దాదాపు రూ. 5 వేలు వరకు వెచ్చించాలి. పూజలు జరిగే వేదిక నృత్యాలు చేసే టెంట్‌ మండపం డెకరేషన్‌కు మరో రూ. 20 వేల వరకు ఖర్చు వస్తుంది.

ఏత్మాసూర్‌ ఉన్న ఇంటికే భారం

గూడెంలో ఎవరి ఇంట్లో ‘ఏత్మాసూర్‌’దేవత ప్రతిష్ట అయి ఉంటుందో ఆ కుటుంబమే దండారీ నిర్వహణ భారం మోయాల్సి ఉంటుంది. ఏడాదంతా ఎండనక, వాననక కష్టపడి పండించిన పాడి పంటల ద్వారా వచ్చిన కొద్ది ఆదాయం పది రోజుల పండుగకే ఖర్చులకు సరిపోతుందని పలువురు నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఝరిలో నృత్యాలు చేస్తున్న గుస్సాడీలు

వివరాలు

జిల్లా దండారీల

ఆదిలాబాద్‌ 641

కుమురంభీం 247

మంచిర్యాల 34

నిర్మల్‌ 78

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement