● తమ కొడుకును చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ ● ఎస్‌ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

● తమ కొడుకును చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ ● ఎస్‌ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం

Nov 8 2026 12:13 AM | Updated on Nov 8 2026 12:13 AM

● తమ కొడుకును చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ ● ఎస్‌ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం

యువకుడి అనుమానాస్పద మృతి

ఇబ్రహీంపట్నంరూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని తరలించడంతో తమ కొడుకును హత్య చేశారని పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోదించారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొహెడ సమీపంలోని నిధి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన తల్లీకొడుకులు జ్యోతి, గజానంద్‌ (21) ఆరు నెలలుగా పని చేస్తున్నారు. జ్యోతి హౌస్‌కీపింగ్‌, గజానంద్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. భర్త సంజీవ దసరా పండుగకు వచ్చాడు. భార్యాభర్తలు శుక్రవారం దీపావళి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లారు. అదే రోజు రాత్రి గజానంద్‌ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం మేనేజర్‌ విజయ్‌ ఫోన్‌ చేసి తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. అప్పటికే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు వచ్చారు. ఎస్సై రాజశేఖర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తమ గోడు వినడం లేదని ఆరోపించారు. దీంతో ఊగిపోయిన ఎస్సై వారిని స్టేషన్‌ నుంచి బయటకు పంపించేశారు. తమ కొడుకుది ముమ్మాటికీ హత్యేనని, చనిపోయంతా పిరికివాడు కాదని, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని తల్లిదండ్రులు స్టేషన్‌ ఎదుట బోరున విలపించారు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా.. గజానంద్‌ ఆత్మహత్య కేసులో సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. ప్రేమ వ్యవహారం చెడిపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఆలయంలో చోరీ

సారంగపూర్‌: మండలంలోని జామ్‌ సమీపంలో గల మహాలక్ష్మీ ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శనివారం ఉదయం రైతులు ఆలయం ముందు నుంచి వెళ్తుండగా తలుపులు తెరిచి ఉండడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామపెద్దలు అక్కడికి వెళ్లి చూడగా అమ్మవారి మెడలో రెండు గ్రాముల పుస్తెలు, వెండి కళ్లు, బొట్టుబిళ్లలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు ఆలయానికి చేరుకుని వివరాలు సేకరించారు. బీరవెల్లి సమీపంలో స్వర్ణ నది వద్ద ఒకరు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఈవిషయమై ఎస్సై శ్రీకాంత్‌ను సంప్రదించగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement