రెబ్బెన: గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి పాఠశాల మైదానంలో శనివారం ఉమ్మడి జిల్లా సెపక్తక్రా జోనల్‌స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14, 17, 19 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనగామ జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా సెపక్తక్రా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, రాష్ట్రస్థాయి కార్యవర్గ సభ్యులు భాస్కర్, మల్లేశ్ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టుదలతో ఆడి జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు, సెపక్తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్మరి మల్లేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి పోశం, పీడీ వశీం ఖాన్, శారద, స్వప్న, పీఈటీ రవి తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న అండర్–14 జట్టు
అండర్–14 బాలుర జట్టులో సీహెచ్ హరీశ్, జె.అభిషేక్, డి.శివప్రణీత్, కె.కేశవరావు, కె.సాయి శ్రీరాం, సీహెచ్ అంకిత్, జె.ప్రణీత్. బాలికల జట్టుకు కె.దర్శిని, ఎం.యాసశ్రీ, జి.అక్షయ, జి.స్వరూప, డి.వైష్ణవి, ఎ.సహస్విని, పి.ప్రితి ఎంపికయ్యారు.
బాలుడికి డెంగీ
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని భీంసరి గ్రామంలో బాలుడికి రెండు రోజుల క్రితం డెంగీ నిర్ధారణ అయింది. అంకోలి పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ బొమ్మెత సుభాష్ వైద్య సిబ్బందితో కలిసి శనివారం గ్రామాన్ని సందర్శించారు. బాలుడికి రెండు రోజుల క్రితం ఆదిలాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో రక్తపరీక్షలు, రిమ్స్‌కు వెళ్లి ఏలీసా టెస్ట్‌తో డెంగీ నిర్ధారణ అయింది. వైద్యపరీక్షలు అనంతరం మందులు అందించి డిశ్చార్జ్ చేశారు. రాత్రి సమయంలో గ్రామంలో బైలర్వా మందు పిచికారి చేయించినట్లు తెలిపారు. సర్పంచ్ గౌరు కార్తీక్, ఉప సర్పంచ్ పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ ఉన్నారు.


