సాత్నాల: మహారాష్ట్ర నుంచి దేశీదారు అక్రమంగా తీసుకువస్తుండగా భోరజ్ మండలం పెండల్‌వాడలో శనివారం ఎకై ్సజ్ ఆదిలాబాద్, డిస్టిక్ టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పెండల్‌వాడలో తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి పెండల్‌వాడకు నడకమార్గంలో బావునే శ్రీనివాస్, లాంగ్డే మారుతి, లాంగ్డే సునీల్, తప్రే రాజు, బావునే సుభాష్ తలపై దేశీదారు పెట్టలు తీసుకువస్తున్నారు. అధికారులను చూసి వాటిని వదిలి పారిపోయారు. మొత్తం 66.24 లీటర్ దేశీదారును పట్టుకోగా, వీటి విలువ రూ. 35 వేలు ఉంటుందని ఎకై ్సజ్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ దాడిలో డిస్టిక్ టాస్క్‌ఫోర్స్ ఆదిలాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్ కుమార్, సిబ్బంది మధు, వెంకటేశ్, హరీశ్, బీరయ్య పాల్గొన్నారు.
14, 15న ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీలు
కాసిపేట: సోమగూడెం మైదానంలో ఈనెల 14,15న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు భైరగోని సిద్దయ్య, వొడ్నాల విజయ్ తెలిపారు. ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో ఆసక్తి ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. పాల్గొనే జట్లు వివరాలకు 9440594508, 8886 800823లో సంప్రదించాలని సూచించారు.


