కడెం: మిషన్ భగీరథ తాగునీటి అవసరాల పేరుతో కడెం ఆయకట్టులోని 68వేల ఎకరాల పంటలకు ఈ నెల 7నుంచి సాగు నీటిని నిలిపివేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నేతలు, జలసాధన సమితి తీవ్రంగా డిమాండ్ చేశాయి. పంటలు చేతికి వచ్చే కీలక తరుణంలో నీటిని నిలిపివేయడం రైతు ల జీవితాలపై గొడ్డలి పెట్టు లాంటిదని మండిపడ్డా యి. ఈ మేరకు తెలంగాణ జలసాధన సమితి కన్వీ నర్, నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకుడు నైనాల గోవర్ధన్ నేతృత్వంలో కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర స్తుతం కడెం ప్రాజెక్ట్‌లో 693.25 అడుగుల నీటి మ ట్టం ఉందని, కాలువకు నీరు అందించడానికి 675 అడుగులు సరిపోతుందని తెలిపారు. కాలువ మ ట్టం కంటే దాదాపు 18.25 అడుగుల అదనపు నీరు నిల్వ ఉన్నప్పటికీ, 20–25 రోజుల్లో కోతకు వచ్చే పంటలకు నీటిని నిలిపివేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరున్నప్పటికీ మిషన్ భగీరథ పేరుతో నీటిని తరలించి రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర జరుగుతోందని తెలిపారు. కడెం భగీరథ నీటిని ఆయకట్టులోని ఏ ఒక్కరూ తాగునీటికి ఉపయోగించడం లేద ని, ఇదొక పెద్ద కుంభకోణమని ఆరోపించారు. చివ రి ఎకరం పండే వరకూ నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆయకట్టు రైతు కుటుంబాల తీవ్ర ఆగ్రహాన్ని, ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మిక్కిలినేని రాజశేఖర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, రైతు నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, రమేశ్ తదితరులున్నారు.


