పంటలు ఎండిపోవడంతోనే ఆత్మహత్యలు | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండిపోవడంతోనే ఆత్మహత్యలు

Nov 6 2026 11:48 PM | Updated on Nov 6 2026 11:48 PM

ఆదిలాబాద్‌రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఏడాది జిల్లాలో 26మంది ఆత్మహత్య చేసుకున్నారని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌రూరల్‌ మండలం కచ్‌కంటి గ్రామానికి చెందిన రైతు బొళ్లి రాజేశ్వర్‌ పంటలు పూర్తిగా ఎండిపోవడంతో, వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు తిరిగి రావనే ఆందోళనతో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని బొర్రన్న పరామర్శించారు. ఆయన వ్యవసాయ పెట్టుబడులు, పంట దిగుబడులు, ఆర్థిక పరిస్థితుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినగా, ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేదని తెలిపారు. పత్తి సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ దిగుబడి రాకపోవడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 194 ప్రకారం రూ.6లక్షల పరిహారం అందించాలని కోరారు. కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5వేల పెన్షన్‌ మంజూరు చేయడంతో పాటు పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట రాములు, దత్తు, రుక్మిణి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement