కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని పలు బియ్యం విక్రయ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, కిరా ణా షాపుల్లో డీఎస్వో నందిని, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సుధారాణి గురువారం తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బియ్యం విక్రయాలు, ధరలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్దేశిత ధరలకే బియ్యం, నిత్యావసరాలు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ షాప్‌వద్ద ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూ చించారు. తనిఖీల్లో తూనికలు, కొలతల శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ అజీజ్ పాషా, ఆదిలాబాద్ డివిజన్ అధికారి నవీన్‌రెడ్డి తదితరులున్నారు.


